స్థానిక ఎన్నికలు ఇప్పట్లో సాధ్యమేనా?

61చూసినవారు
స్థానిక ఎన్నికలు ఇప్పట్లో సాధ్యమేనా?
AP: రాష్ట్రంలో స్థానిక ఎన్నికల సందడి, రాజకీయ వేడి స్పష్టంగా కనిపిస్తోంది. అక్టోబర్ చివరి నాటికి ఎన్నికలు పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అయితే అది సాధ్యమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు. బీసీ రిజర్వేషన్లపై ఏర్పాటైన కమిషన్ గడువును ప్రభుత్వం మళ్లీ పొడిగించింది. అలాగే రిజర్వేషన్ల అంశంపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ ఏడాది జనవరి నాటికి ఓటర్ల జాబితా ఆధారంగా ఎన్నికలు నిర్వహించాలన్న నిర్ణయంపై కూడా పిటిషన్ దాఖలైంది. దాంతో ఎన్నికల నోటిఫికేషన్ ఇప్పట్లో విడుదల అయ్యే అవకాశాలు కనిపించడం లేదు.

సంబంధిత పోస్ట్