AP: జనసైనికులు మళ్లీ మోసపోతున్నారా? అంటే అవుననే ప్రచారం జరుగుతోంది. సార్వత్రిక ఎన్నికల్లో నామినేషన్‌కు ముందు రోజు
టీడీపీ నుంచి జనసేనకు చేరి.. ఎమ్మెల్యే అభ్యర్థి అయినట్లు ఇప్పుడు స్థానిక ఎన్నికల్లో కూడా అదే జరుగుతున్నట్లు టాక్ వినిపిస్తోంది. పేరుకు
జనసేన కోటా అయినా.. నిలబడేది
టీడీపీ అభ్యర్థులేనని సమాచారం. ఇప్పటికే కొన్ని జిల్లాల్లో రాజీనామాలు, చేరికలు, సంప్రదింపులు జరిగిపోయాయి. పార్టీ కోసం పని చేసిన వారికి పక్కన పెట్టి..
టీడీపీ నుంచి వచ్చిన వారికి ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలుస్తోంది. దాంతో జనసైనికులు తీవ్ర నిరాశలో ఉన్నట్లు సమాచారం.