AP: రాష్ట్రంలో ప్రజాస్వామ్యాన్ని చంద్రబాబు ఖూనీ చేస్తున్నారని మాజీ సీఎం
జగన్ ఆరోపించారు. రాష్ట్రంలో జరుగుతున్నది జంగిల్ రాజ్ అని ఆయన తీవ్రస్థాయిలో విమర్శించారు. నామినేషన్ల ప్రక్రియలో జరుగుతున్న అక్రమాలపై ఆధారాలు చూపినప్పటికీ, చంద్రబాబు మరియు ఎన్నికల కమిషన్ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని, పోలీసు వ్యవస్థ కూడా వారికి మద్దతు ఇస్తోందని ఆయన ఆరోపించారు. వీటిని ఎన్నికలంటారా?.. ఇక
ఎన్నికలు ఎలా జరుగుతాయని ఆయన ప్రశ్నించారు.