అర్నబ్‌ ఎఫెక్ట్‌: అనంతగిరిలో కొట్టుకుపోయిన వంతెనలు

33చూసినవారు
అర్నబ్‌ ఎఫెక్ట్‌: అనంతగిరిలో కొట్టుకుపోయిన వంతెనలు
AP: అల్లూరి సీతారామరాజు జిల్లాలో అర్నబ్ తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీనివల్ల అనంతగిరి మండలం, తాడిగూడ గ్రామంలోని వంతెన కొట్టుకుపోయి రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అలాగే కొత్తూరు పంచాయతీ పరిధిలో శివలింగపురం-కృష్ణాపురం మధ్య మరో వంతెన ధ్వంసమైంది. కాశీపట్నం వద్ద గోస్తని నది ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తోంది. వంతెనల పునర్నిర్మాణం కోసం ప్రభుత్వం తక్షణమే స్పందించాలని తాడిగూడ గ్రామస్థులు కోరుతున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్