AP: అర్నబ్ తుఫాన్ ప్రభావంతో ఉత్తరాంధ్ర జిల్లాల్లో గత 24 గంటల్లో రికార్డుస్థాయిలో భారీ వర్షపాతం నమోదైంది. మంగళవారం ఉదయం 8.30 గంటల నుండి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు అత్యధికంగా విశాఖపట్నంలోని గోపాలపట్నంలో 315.75 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. అలాగే విజయనగరంలోని కొత్తవలసలో 303.78 మి.మీ, భోగాపురంలో 282.87mm వర్షపాతం నమోదైంది. విజయనగరం, విశాఖ, అనకాపల్లి, శ్రీకాకుళం, మన్యం, అల్లూరి, గోదావరి జిల్లాల్లో ఈ భారీ వర్షాల ప్రభావం తీవ్రంగా ఉంది.