ఆంధ్రప్రదేశ్‌ను కుదిపేసిన ‘అర్నాబ్’ తుఫాన్ తీరం దాటి క్రమంగా బలహీనపడుతోంది. ఇది ఉత్తర వాయవ్య దిశగా కదులుతూ తీవ్ర వాయుగుండంగా మారుతుందని వాతావరణ శాఖ పేర్కొంది. విశాఖ కలెక్టర్ అభిషిక్త కిశోర్ తెలిపిన వివరాల ప్రకారం, తుఫాన్ ప్రభావం తీరం దాటిన 36 గంటల పాటు కొనసాగుతుంది. సముద్రంలో అలలు ఎగసిపడుతున్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, చెట్ల కింద నిలబడొద్దని సూచించారు. భారీ వర్షాల దృష్ట్యా జిల్లాలోని విద్యాసంస్థలకు సెలవు ప్రకటించి, కలెక్టరేట్లో 24 గంటల కంట్రోల్ రూమ్‌ను ఏర్పాటు చేశారు.