AP: అర్నబ్ తుఫాన్ భూమిపై పూర్తిగా ల్యాండ్ అయింది. తీరం దాటిన అర్నబ్ తుఫాన్ తీవ్ర ప్రభావం చూపుతోంది. గంటకు 120 కి.మీ వేగంతో వీస్తున్న గాలుల కారణంగా అనకాపల్లి నుంచి బాపట్ల జిల్లా వరకు ప్రభుత్వం రెడ్ అలర్ట్ జారీ చేసింది. రాబోయే 6-7 గంటలు అత్యంత కీలకం కానున్నాయి. ఇప్పటికే ఉత్తరాంధ్రలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. విద్యుత్ వ్యవస్థ దెబ్బతినడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలిస్తున్నారు. మరో 24 గంటలు ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ హెచ్చరించింది.