ఏపీలో దారుణం.. తల్లిని హత్య చేసిన కుమారుడు

4చూసినవారు
ఏపీలో దారుణం.. తల్లిని హత్య చేసిన కుమారుడు
AP: ఏలూరు శాంతినగర్‌లో ఒక దారుణ ఘటన వెలుగుచూసింది. భర్త మరణం తర్వాత కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్న కొమ్ము సత్యవతిని, ఆమె సొంత కొడుకు సురేశ్ హత్య చేసినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు. సత్యవతితో కలిసి ఉంటున్న సురేశ్ ఈ ఘాతుకానికి పాల్పడినట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్