AP: కూటమిలో విభేదాలు మరోసారి బయటపడ్డాయి.
బీజేపీ సానుభూతిపరుడిపై
టీడీపీ నేతలు దాడి చేశారు. వైఎస్సార్ కడప జిల్లా సుండుపల్లి మండలం చిన్నగోల్లపల్లిలో
బీజేపీ సానుభూతిపరుడు నామినేషన్‌కు వెళ్తుండగా దాడి జరిగింది. తీవ్రంగా గాయపడిన ఆయనను రాయచోటి ఆస్పత్రికి తరలించారు. మండల పరిషత్ ఎన్నికల్లోనూ తనపై దాడి చేశారని
బీజేపీ నేత తెలిపారు. పోలీసుల నుంచి తనకు ఎలాంటి రక్షణ లభించలేదని ఆవేదన వ్యక్తం చేశారు.