AP: తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి నియోజకవర్గంలో తొట్టంబేడు మండలం లింగమనాయుడుపల్లికి చెందిన
వైసీపీ మాజీ సర్పంచ్ గుడ్లూరు వెంకట రామానాయుడిపై దాడి జరిగింది. మండల పార్టీ ఇన్ఛార్జ్ ఉన్నం వాసు నాయుడు ఇంటికి కారులో వెళ్తుండగా
టీడీపీ నేతలు అడ్డుకున్నారు. వాహనాన్ని ధ్వంసం చేసి, ఆయనపై విచక్షణారహితంగా భౌతిక దాడికి పాల్పడ్డారు.