టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య దాడులు

77చూసినవారు
టీడీపీ, వైసీపీ వర్గీయుల మధ్య దాడులు
AP: నంద్యాల జిల్లా అహోబిలంలో పోలింగ్ జరుగుతున్న సమయంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగింది. రిగ్గింగ్‌ జరుగుతోందనే సమాచారంతో ఎమ్మెల్యే భూమా అఖిలప్రియ పోలింగ్ కేంద్రానికి వెళ్లగా, అక్కడ వారిద్దరి వర్గీయులు రాళ్లు, కర్రలతో దాడులకు దిగారు. ఈ గొడవలో ఎమ్మెల్యే అఖిలప్రియ కారుపై దుండగులు దాడి చేసి అద్దాలను ధ్వంసం చేశారు. ఈ ఘటనతో పోలింగ్ కేంద్రం వద్ద పరిస్థితి ఒక్కసారిగా ఉద్రిక్తంగా మారింది. ఆందోళనకర పరిస్థితుల మధ్య పోలీసులు పరిస్థితిని అదుపు చేసేందుకు ప్రయత్నిస్తున్నారు.

సంబంధిత పోస్ట్