AP: రాష్ట్రంలోని ఆటో, క్యాబ్ డ్రైవర్లకు కూటమి ప్రభుత్వం శుభవార్త అందించింది. వాహనమిత్ర పథకం కింద అర్హులైన డ్రైవర్లకు ఏటా అందజేసే రూ.15 వేల ఆర్థిక సాయం కోసం ప్రభుత్వం రూ.231 కోట్లను విడుదల చేసింది. సొంతంగా ఆటో లేదా క్యాబ్ నడుపుకుంటూ రిజిస్టర్డ్ యజమానిగా ఉన్న డ్రైవర్లకు మాత్రమే ఈ సాయం అందుతుందని అధికారులు స్పష్టం చేశారు. కేవలం ప్యాసింజర్ వాహనాలకే ఈ పథకం వర్తిస్తుందని, గూడ్స్ వాహనాలకు వర్తించదని పేర్కొన్నారు. త్వరలోనే ఈ నిధులు నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ కానున్నాయి.