AP:
వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డికి షాక్ తగిలింది. గుంటూరు రెండో అదనపు జిల్లా కోర్టు ఆయన బెయిల్‌ను నిరాకరించింది. ఎంపీటీసీ ఎన్నికల సందర్భంగా లేళ్ల అప్పిరెడ్డి బ్యాలెట్ బాక్స్ లాక్కున్నారని, ఎన్నికల అధికారుల విధులకు ఆటంకం కలిగించారనే ఆరోపణలున్నాయి. ప్రస్తుతం ఆయన రాజమహేంద్రవరం జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు కీలక దశలో ఉండటంతో కోర్టు బెయిల్‌ను నిరాకరించింది.