AP: పల్నాడు జిల్లాలో సర్పంచ్ ఎన్నికల వేళ ఉద్రిక్తత చోటుచేసుకుంది. హిందూపురం ఎమ్మెల్యే, నటుడు నందమూరి బాలకృష్ణ పీఏ పావులూరి శ్రీనివాసరావును పోలీసులు అరెస్ట్ చేశారు. యడ్లపాడు మండలం తిమ్మాపురంలో సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో రెండు
టీడీపీ వర్గాల మధ్య వివాదం నెలకొంది. శ్రీనివాసరావుకు చెందిన పత్తి మిల్లులో తనిఖీలు చేసిన పోలీసులు 60 కర్రలు, 4 కత్తులు, 25 కార్లను స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసరావుతో సహా 66 మందిని అరెస్ట్ చేసి నాన్ బెయిలబుల్ కేసులు నమోదు చేశారు. మరో 34 మంది పరారీలో ఉన్నట్లు ఏఎస్పీ వెల్లడించారు. ఘటనపై దర్యాప్తు కొనసాగుతోంది.