
దసరా పండుగ వేళ.. భారీగా పెరిగిన సన్నబియ్యం ధరలు
దసరా పండుగ సమీపిస్తున్న తరుణంలో హైదరాబాద్ మార్కెట్లో సన్నబియ్యం ధరలు గణనీయంగా పెరిగాయి. గత 30-45 రోజుల్లో 25 కిలోల బస్తాపై రూ.300 నుంచి రూ.500 వరకు పెరగడంతో, ప్రస్తుతం కిలో ధర రూ.90కి చేరింది. కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర వంటి పొరుగు రాష్ట్రాల వ్యాపారులు తెలంగాణలో నేరుగా ధాన్యం కొనుగోలు చేయడం, వానాకాలంలో వరి సాగు విస్తీర్ణం తగ్గడం, ప్రజా పంపిణీ వ్యవస్థ కోసం ప్రభుత్వం భారీగా నిల్వలు ఉంచుకోవడం వంటి కారణాలతో ధరలు పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.




