
ఇంకొల్లులో ఎన్నికల ప్రచారాన్ని ఘనంగా ప్రారంభించిన టీడీపీ అభ్యర్థులు
బాపట్ల జిల్లా ఇంకొల్లులో స్థానిక ఎంపీటీసీ ఎన్నికల సందడి గురువారం మొదలైంది. ఎంపీటీసీ అభ్యర్థి కందిమల్ల బిందు మాధవి, తోటి అభ్యర్థులు మస్తాన్ బాబా, వల్లేరు రుతమ్మ, నంబూరి శ్రీనివాసరావులతో కలిసి నామినేషన్ దాఖలు చేశారు. అనంతరం వీరంతా టీడీపీ కార్యకర్తలతో కలిసి పావులూరు రోడ్డులోని డీఎన్టీ కాలనీలో ఎన్నికల ప్రచారాన్ని చేపట్టారు. ప్రచారానికి ముందు గంగాపార్వతి సమేత భీమేశ్వర ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, విజయం కోసం ఆకాంక్షించారు.


















