
పల్నాడులో గాంధీ జయంతి ఘనంగా నివాళులు
పల్నాడు, నరసరావుపేట, చిలకలూరిపేట ప్రాంతాలలో శుక్రవారం మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రొంపిచర్ల మండలంలో జరిగిన ఈ కార్యక్రమంలో వైయస్సార్సీపి రాష్ట్ర కార్యదర్శి పడాల శివారెడ్డి, ఆర్యవైశ్య నాయకులు గొడవర్తి వెంకటేశ్వర్లు, పసుమర్తి ఆదినారాయణ పాల్గొని "జోహార్ మహాత్మా గాంధీ" అంటూ నినాదాలు చేశారు. దేశ స్వాతంత్ర్యం కోసం ఆయన చేసిన సేవలు, సత్యం, అహింసా మార్గాలను కొనియాడుతూ ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.































