బాపట్ల జిల్లా చీరాల పోలీసుల కస్టడీలో ఉన్న ముగ్గురు ఖైదీలు తప్పించుకున్నారు. కోర్టు వాయిదా అనంతరం నిందితులను తిరిగి జైలుకు తరలిస్తుండగా, ఒంగోలు రైల్వే స్టేషన్లో పోలీసుల కళ్లుగప్పి వారు పరారయ్యారు. మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన ఈ ముగ్గురు నిందితుల కోసం ప్రత్యేక పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చేపడుతున్నాయి. రైల్వే స్టేషన్ వద్ద రద్దీ ప్రాంతంలో ఈ ఘటన జరగడం భద్రతా వైఫల్యంగా కనిపిస్తోంది. ఉన్నతాధికారులు అప్రమత్తమై రైల్వే స్టేషన్లు, బస్టాండ్లు, ప్రధాన రహదారులపై నిఘా పెంచారు.