
ఎంపీ పెమ్మసానిని కలిసిన మాదల మీనా రత్న
గుంటూరు ఎంపీ, కేంద్ర సహాయ మంత్రి డా. పెమ్మసాని చంద్రశేఖర్ను ఆయన స్వగృహంలో జనచైతన్య గ్రూప్ అధినేత, టీడీపీ యువ నాయకుడు మాదల చైతన్య, ఆయన సతీమణి మాదల మీనా రత్న మర్యాదపూర్వకంగా కలిశారు. గుంటూరు నగర మేయర్ పదవి జనరల్ మహిళకు కేటాయించడంతో ఈ భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. టీడీపీ తరఫున మేయర్ అభ్యర్థిగా మాదల మీనా రత్న పేరు పరిశీలనలో ఉందనే ప్రచారం నేపథ్యంలో, పార్టీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందనే అంశంపై నగరంలో రాజకీయ చర్చ జోరుగా సాగుతోంది.





































