
గుంటూరు మేయర్ అభ్యర్థిగా మాదల మీనారత్న పేరు పరిశీలన!
గుంటూరు మేయర్ పదవి జనరల్ మహిళకు రిజర్వ్ కావడంతో టీడీపీ తరఫున మాదల మీనారత్న పేరు పరిశీలనలో ఉన్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది. జనచైతన్య గ్రూప్ అధినేత మాదల చైతన్య సతీమణి అయిన ఆమెకు మూడు తరాలుగా టీడీపీతో అనుబంధం ఉన్న కుటుంబ నేపథ్యం ఉంది. ఆమె అభ్యర్థిత్వంపై పార్టీ అధిష్ఠానం నిర్ణయం కోసం ఆసక్తి నెలకొంది. అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.








































