గురజాల - Gurazala

జానపాడులో దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలి: పిడిఎం

జానపాడులో దాడి ఘటనపై చర్యలు తీసుకోవాలి: పిడిఎం

పిడుగురాళ్ల మండలం జానపాడు గ్రామంలో మాల కులస్తులపై దాడికి పాల్పడిన వారిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని పిడిఎం నాయకులు డిమాండ్ చేశారు. దాడిలో గాయపడి నరసరావుపేట ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కోడిరెక్క హేమంత్ తదితరులను వారు పరామర్శించారు. ఈ నెల 17న వినాయకుడి ఊరేగింపు సందర్భంగా డీజే శబ్దం తగ్గించాలని కోరినందుకు కులం పేరుతో దూషిస్తూ దాడి చేశారని ఆరోపించారు. బాధితులకు న్యాయం చేయకపోతే అన్ని సంఘాలను కలుపుకుని ఉద్యమిస్తామని పిడిఎం నాయకులు హెచ్చరించారు.

వీడియోలు


పెద్దపల్లి జిల్లా
స్నాప్‌చాట్‌ స్నేహం.. హోటల్‌కు తీసుకెళ్లి బాలికపై యువకుడు అత్యాచారం
Sep 26, 2026, 05:09 IST/

స్నాప్‌చాట్‌ స్నేహం.. హోటల్‌కు తీసుకెళ్లి బాలికపై యువకుడు అత్యాచారం

Sep 26, 2026, 05:09 IST
మధ్యప్రదేశ్‌లోని గ్వాలియర్‌లో స్నాప్‌చాట్ ద్వారా పరిచయమైన యువకుడు, ఇంటర్ విద్యార్థినిని హోటల్‌కు తీసుకెళ్లి బెదిరించి అత్యాచారానికి పాల్పడిన ఘటన కలకలం రేపింది. సెప్టెంబర్ 22న కృష్ణ ఖత్వాని అనే యువకుడు బాలికను కలవడానికి పిలిచాడు. అనంతరం విద్యార్థినిని బెదిరించి, అభ్యంతరకర ఫోటోలు వైరల్ చేస్తానని భయపెట్టి హోటల్‌కు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. సెప్టెంబర్ 24న బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు పోక్సో చట్టం కింద FIR నమోదు చేసి, పరారీలో ఉన్న నిందితుడి కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపింది.