
గుంటూరులో ఉల్లిపాయల లారీ బోల్తా..డ్రైవర్‌కు గాయాలు
గుంటూరులో సోమవారం ఉదయం NH16 పై కంతేరు అడ్డరోడ్డు సమీపంలో ఉల్లిపాయల లోడుతో వెళ్తున్న లారీ బోల్తాపడింది. ఈ ఘటనలో లారీ డ్రైవర్‌కు గాయాలయ్యాయి. లారీ బోల్తాపడటంతో రోడ్డుపై ఉల్లిపాయలు చెల్లాచెదురుగా పడిపోయి ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. గాయపడిన డ్రైవర్‌ను పోలీసులు గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.































