బాపట్ల జిల్లా పర్చూరు ప్రాంతంలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మంగళవారం ఈ వర్షాల కారణంగా పర్చూరు - గుంటూరు వాడరేవు హైవేపై వాగు ఉప్పొంగి రహదారిపైకి భారీగా వరద నీరు వచ్చి చేరింది. రహదారులపై వరద ఉధృతి పెరగడంతో ప్రయాణం ప్రమాదకరంగా మారింది. వరద పరిస్థితుల దృష్ట్యా స్థానిక యంత్రాంగం అప్రమత్తమైంది.