
పెదకాకానిలో ఘోర ప్రమాదం.. లారీ డ్రైవర్ దుర్మరణం
పెదకాకాని పరిధిలోని జాతీయ రహదారిపై సోమవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ ఆజాద్ (40) అక్కడికక్కడే మరణించాడు. హైవేపై ఆగి ఉన్న తన లారీ టైరును చెక్ చేసుకుంటుండగా, వెనుక నుంచి వేగంగా వచ్చిన మరో లారీ బలంగా ఢీకొట్టడంతో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ప్రమాదానికి కారణమైన లారీ డ్రైవర్ను పోలీసులు అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.


































