
పొన్నూరులో మిగిలిన మూడు మద్యం దుకాణాలకు మళ్లీ నోటిఫికేషన్
గుంటూరు జిల్లా పొన్నూరు పట్టణ పరిధిలో గత లాటరీలో కేటాయింపు కాని మూడు మద్యం దుకాణాలకు ఎక్సైజ్ సీఐ మేడికొండ రమేష్ శనివారం మళ్లీ నోటిఫికేషన్ విడుదల చేశారు. ఈనెల 10వ తేదీ నుండి 19వ తేదీ అర్ధరాత్రి వరకు ఆన్లైన్, ఆఫ్లైన్లలో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం 21వ తేదీ ఉదయం గుంటూరులో లాటరీ నిర్వహించనున్నట్లు సీఐ తెలిపారు.

































