జనసేన పార్టీలో ఏర్పడిన బీఫాంలో రగడ పొన్నూరు మున్సిపల్ కార్యాలయం వద్ద కొంత ఉద్రిక్తతను సృష్టించింది. పొన్నూరు మున్సిపాలిటీకి జరుగుతున్న ఎన్నికలలో
జనసేన తరపు నుండి పోటీ చేస్తున్న అభ్యర్థులకు ఆ పార్టీలోని కిలారి రోశయ్య వడ్రాణం, మార్కండేయ బాబుల రెండు వర్గాలు బి ఫామ్లను తమ అభ్యర్థులకు ఇచ్చాయి. దీనితో ఏ వర్గానికి చెందిన బిఫారాలు చెల్లుబాటు అవుతాయని ఉత్కంఠత ఏర్పడింది. అయితే పార్టీ కేంద్ర కార్యాలయం నుండి వచ్చిన లేఖతో మార్కండేయ బాబు వర్గానీదే పై చేయి అయ్యింది. మాజీ ఎమ్మెల్యే కిలారు రోశయ్య పార్టీ నుండి వచ్చిన లేఖపై లేవనెత్తిన సందేహాలపై అసిస్టెంట్ ఎన్నికల అథారిటీ ఎం రమేష్ బాబు స్పష్టత ఇవ్వటంతో వివాదం సద్దుమణిగింది.