
రేపల్లెలో రూ. 40 లక్షలతో వడ్డెర కమ్యూనిటీ భవనం ప్రారంభం
రేపల్లె పట్టణంలోని 13వ వార్డులో రూ. 40 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన వడ్డెర కమ్యూనిటీ భవనాన్ని మంత్రి కొలుసు పార్థసారధితో కలిసి ప్రారంభించడం సంతోషంగా ఉందని ఎమ్మెల్యే తెలిపారు. వడ్డెరల సామాజిక, ఆర్థిక అభ్యున్నతికి కూటమి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషి చేస్తోందని పేర్కొన్నారు. ఈ భవనం వడ్డెర సామాజిక వర్గానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని అన్నారు. కార్యక్రమంలో స్థానిక నాయకులు, వడ్డెర సంఘం ప్రతినిధులు పాల్గొన్నరు.






















