
సత్తెనపల్లిలో యువతకు ఉచిత నైపుణ్య శిక్షణ, ఉద్యోగ అవకాశాలు
పల్నాడు జిల్లా సత్తెనపల్లిలో DDU-GKY పథకం కింద 18-25 ఏళ్ల గ్రామీణ నిరుద్యోగ యువతీ యువకులకు 4 నెలల ఉచిత నైపుణ్య శిక్షణ అందిస్తున్నారు. 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ పూర్తి చేసిన వారికి కంప్యూటర్ స్కిల్స్, టాలీ, ఎలక్ట్రానిక్ హార్డ్వేర్ అసెంబ్లింగ్, రిపేరింగ్ నేర్పిస్తారు. ఉచిత భోజనం, వసతితో పాటు కోర్సు అనంతరం ప్రభుత్వ సర్టిఫికేట్, ఉద్యోగ అవకాశాలు కల్పిస్తారు. ఆసక్తిగలవారు సెంటర్ ఇన్ఛార్జ్ హరేరాoబాబు (63008 28505), ఐటీ ట్రైనర్ లూర్దు (7981171852)ను సంప్రదించవచ్చు.






















