
తుళ్లూరులో ఘనంగా ముగిసిన దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు
గుంటూరు జిల్లా, తాడికొండ నియోజకవర్గంలోని తుళ్లూరులో మంగళవారం దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు వైభవంగా ముగిశాయి. శ్రీ వేణుగోపాలస్వామి దేవస్థానం, గీత మందిరం వద్ద రాజరాజేశ్వరి దేవి అలంకరణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు, సహస్ర నామార్చన, పూర్ణాహుతి హోమం నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులకు అన్నప్రసాద వితరణ చేపట్టారు. సాయంత్రం 4 గంటలకు అమ్మవారి గ్రామ ఉత్సవ సేవ మరియు తెప్పోత్సవం కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని ఆలయ కమిటీ సభ్యులు కోరారు.






















