
నందివెలుగు వద్ద గుర్తుతెలియని మృతదేహం
తెనాలి నందివెలుగు జంక్షన్ సమీపంలోని కాలువలో సోమవారం గుర్తుతెలియని మృతదేహం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 45 ఏళ్లు ఉంటుంది. ముఖం గుర్తుపట్టలేని విధంగా పూర్తిగా కుళ్లిపోయి ఉంది. ప్యాంటు, షర్టు ధరించి ఉన్నాడు. పోలీసులు మృతదేహాన్ని వెలికితీసి తెనాలి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ వ్యక్తి వివరాలు ఏమైనా తెలిసిన వారు తెనాలి తాలూకా పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.





































