గుంటూరు జిల్లాలో శనివారం జరగనున్న ఎంపీటీసీ, జడ్పీటీసీ ఎన్నికల ఓట్ల కౌంటింగ్ అనంతరం అభ్యర్థులు, వారి అనుచరులు విజయోత్సవ ర్యాలీలు నిర్వహించేందుకు అనుమతి లేదని ఎస్పీ స్పష్టం చేశారు. కౌంటింగ్ కేంద్రాలు, రాజకీయ పార్టీల కార్యాలయాల వద్ద ప్రజలు గుంపులుగా గుమిగూడకుండా నిరంతర నిఘా ఉంచాలని ఆదేశించారు. అభ్యర్థులు, వారి అనుచరుల మధ్య ఘర్షణలు తలెత్తకుండా అవసరమైన ప్రాంతాల్లో అదనపు బలగాలు, పోలీస్ పికెట్లు ఏర్పాటు చేయాలని సూచించారు. గతంలో అల్లర్లకు పాల్పడిన వ్యక్తులు, రౌడీషీటర్ల కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని ఎన్నికల ఫలితాల అనంతరం ఎవరైనా శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఉపేక్షించేది లేదన్నారు.