
పాము కాటుతో మహిళ మృతి
గుంటూరు సర్వజన ఆస్పత్రిలో మహిళ పాము కాటుతో చికిత్స పొందుతూ కొండపూడి సుజాత (46) అనే మహిళ మృతి చెందిన సంఘటన చోటుచేసుకుంది. వేమూరు మండలం కుచ్చెళ్లపాడుకు చెందిన ఆమె సోమవారం తెల్లవారుజామున నిద్రలేచి మరుగుదొడ్డికి వెళ్లి వచ్చిన తర్వాత కాలుపై ఏదో కుట్టినట్లు నొప్పిగా ఉండడంతో పాము కాటును గుర్తించారు. కుటుంబ సభ్యులు మొదట తెనాలి ప్రభుత్వ వైద్యశాలకు, ఆపై మెరుగైన వైద్యం కోసం గుంటూరుకు తరలించారు. చికిత్స పొందుతూ ఆమె మృతి చెందినట్లు భర్త పోలీసులకు ఫిర్యాదు చేశారు.























