
విద్యుత్ షాక్ తో రైతు మృతి
బొల్లాపల్లి మండలం గుట్లపల్లి శివారు కండ్రికలో ఆదివారం విషాదకర ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన 31 ఏళ్ల రైతు మందగాని కాశీరత్నం తన మిరప చేనుకు నీళ్లు పెట్టేందుకు వెళ్లగా, పొలం వద్ద సోలార్ కంచె విద్యుత్ తీగలు తెగిపడి ఉండటంతో వాటికి తగిలి విద్యుదాఘాతానికి గురయ్యారు. ఆయన అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ ఘటనతో ఆ గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది.



























