AP: వెన్నుపోటు పార్టీ వంచనపై జరిగిన బీసీ గర్జన సమావేశంలో YCP బీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రమేష్ యాదవ్, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ, విడదల రజిని కూటమి ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలకు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో ప్రభుత్వం విఫలమైందని, రాజ్యాధికారం ఉంటేనే సమాజం అభివృద్ధి చెందుతుందని బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. రాష్ట్ర జనాభాలో 50 శాతానికి పైగా ఉన్న బీసీలను 'బ్యాక్‌బోన్' అని చెప్పిన ఏకైక నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి అని రమేష్ యాదవ్ కొనియాడారు.