శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్

27చూసినవారు
శ్రీకాకుళం కార్పొరేషన్ ఎన్నికల్లో బిగ్ ట్విస్ట్
AP: శ్రీకాకుళం నగర పాలక సంస్థ పరిధిలోని 30వ డివిజన్ కుశాలపురంలో అనూహ్య పరిణామాలు చోటుచేసుకున్నాయి. తమ గ్రామ పంచాయతీని కార్పొరేషన్‌లో విలీనం చేయడాన్ని నిరసిస్తూ గ్రామస్తులు ఎన్నికలను బహిష్కరించాలని నిర్ణయించుకున్నారు. ఈ నిరసనలో భాగంగా, 30వ డివిజన్ నుంచి పోటీకి దిగిన 13 మంది అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారు. దీనితో అక్కడ ఒక్క అభ్యర్థి కూడా లేని పరిస్థితి ఏర్పడింది. గ్రామస్తులు మేయర్ ఎన్నికలతో సహా కార్పొరేటర్ ఎన్నికలను పూర్తిగా బహిష్కరిస్తున్నట్లు ప్రకటించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్