AP: సీఎం చంద్రబాబు నాయుడుతో
బీజేపీ ఏపీ అధ్యక్షుడు మాధవ్, మంత్రి సత్యకుమార్ యాదవ్ సోమవారం నాడు సమావేశమయ్యారు. ఈ భేటీలో స్థానిక సంస్థల ఎన్నికల్లో సీట్ల సర్దుబాటుపై చర్చలు జరిగినట్లు సమాచారం. జనసేనతో చర్చలు విజయవంతం కావడంతో, ఇప్పుడు బీజేపీతో
టీడీపీ నేతలు సీట్ల సర్దుబాటుపై మాట్లాడుతున్నారు. ఈ సమావేశం రాబోయే ఎన్నికల వ్యూహాలపై కీలక ప్రభావం చూపనుంది.