AP:
బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి
వైసీపీ అధినేత
జగన్ మోహన్ రెడ్డిని కలిసేందుకు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలో ఆయన తన ఎమ్మెల్యే పదవికి,
బీజేపీ పార్టీకి రాజీనామా చేయనున్నారని ప్రచారం జరుగుతోంది. తాను గెలిపించిన నలుగురు జడ్పీటీసీ సభ్యులు కూడా రాజీనామా చేసే అవకాశం ఉందని తెలుస్తోంది. గతంలో
జగన్ పై వ్యక్తిగత విమర్శలు చేసిన నేపథ్యంలో, ఆయనను పార్టీలో చేర్చుకుంటారా?.. అన్నదానిపై రాజకీయ వర్గాల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది.