కూట‌మిపై బీజేపీ ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు

53చూసినవారు
కూట‌మిపై బీజేపీ ఎమ్మెల్యే ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు
AP: బీజేపీలో నిత్యం సంచలన వ్యాఖ్యలు చేసే సీనియర్ నేత, విశాఖ ఉత్తర ఎమ్మెల్యే విష్ణుకుమార్ రాజు మరోసారి తనదైన శైలిలో బాంబు పేల్చారు. రాష్ట్రంలో కూటమి, కేంద్రంలో మోదీ ప్రభుత్వం ఎప్పటివరకూ సేఫ్ గా ఉంటాయో విష్ణుకుమార్ రాజు తేల్చిచెప్పేశారు. రాష్ట్రంలో జగన్ ఉన్నంతకాలం ఇక్కడ కూటమికి ఎలాంటి ఢోకా లేదని ఆయన తేల్చిచెప్పేశారు. అలాగే కేంద్రంలో రాహుల్ గాంధీ ఉన్నంతవరకూ ఎన్డీయేకు వచ్చిన ఇబ్బందేమీ లేదని విష్ణు తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్