వర్షాల కోసం ఊరంతా ఒక్కటై వనభోజనాలు.. ఈ వింత ఆచారం ఎక్కడో తెలుసా?

5493చూసినవారు
AP: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గం బోరంపల్లిలో వర్షాలు కురవాలని కోరుకుంటూ శనివారం గ్రామస్తులు అనాదిగా వస్తున్న సాంప్రదాయాన్ని నిర్వహించారు. ఊరి ప్రజలంతా ఇళ్లకు తాళాలు వేసుకుని, మేళతాళాలతో శివారులోని ఆంజనేయస్వామి ఆలయానికి చేరుకుని వంటలు చేసుకుని సహపంక్తి భోజనాలు చేశారు. ఇలా ఊరంతా కలిసి ప్రార్థించి వనభోజనాలు చేస్తే వర్షాలు సమృద్ధిగా కురుస్తాయని వారి నమ్మకం. ప్రార్థనల అనంతరం సాయంత్రం తిరిగి ఇళ్లకు చేరుకున్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్