ఏపీలోని బాపట్ల జిల్లా కారంచేడు-3 ఎంపీటీసీ స్థానానికి జరిగిన ఎన్నికల్లో అధికారుల నిర్లక్ష్యం బయటపడింది.
టీడీపీ అభ్యర్థి సుభాషిణి,
వైసీపీ అభ్యర్థి సహాయమాతకు ఎన్నికల అధికారులు పొరపాటున ఒకే గుర్తును అంటే 'ఫ్యాన్' గుర్తును కేటాయించారు. దీనిపై
టీడీపీ అభ్యర్థి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేయడంతో వివాదం చెలరేగింది. వెంటనే స్పందించిన అధికారులు ఆ తప్పిదాన్ని సరిదిద్ది,
టీడీపీ అభ్యర్థికి 'సైకిల్' గుర్తును కేటాయించారు. ఎన్నికల నిర్వహణలో అధికారుల నిర్లక్ష్యంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.