బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ

13చూసినవారు
బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణ
AP: శాసనమండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ కుటుంబానికి షాక్ తగిలింది. బొత్స సోదరుడి కుమారుడు, వైసీపీ జెడ్పీటీసీ అభ్యర్థి బొత్స చైతన్య నామినేషన్ తిరస్కరణకు గురైంది. పూసపాటిరేగలో బొత్స చైతన్య పోటీ చేయడంపై జనసేన నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. ఆయనకు విజయనగరంలో ఓటు హక్కు ఉందని పేర్కొంటూ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. అధికారులు విచారణ జరిపి బొత్స చైతన్య నామినేషన్‌ను తిరస్కరించినట్లు తెలిసింది.

సంబంధిత పోస్ట్