మరోసారి కంటతడి పెట్టుకున్న బొత్స (వీడియో)

33చూసినవారు
AP: వచ్చే శాసనసభ ఎన్నికల్లో చీపురుపల్లి నియోజకవర్గం నుంచే పోటీ చేస్తానని వైసీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. గరివిడిలో శనివారం నిర్వహించిన వైసీపీ కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ సందర్భంగా భావోద్వేగానికి గురై మరోసారి కంటతడి పెట్టారు. తనపై చీపురుపల్లి ప్రజలు చూపిస్తున్న ఆదరాభిమానాలను చూసి భావోద్వేగానికి లోనైనట్లు బొత్స తెలిపారు.

సంబంధిత పోస్ట్