AP: విజయనగరం జిల్లా గరివిడిలో జరిగిన
వైసీపీ ఆత్మీయ సమావేశంలో మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ భావోద్వేగానికి గురయ్యారు. బొత్స మేనల్లుడు, జడ్పీ ఛైర్మన్ మజ్జి శ్రీనివాసరావు (చిన్న శ్రీను) వైసీపీని వీడి టీడీపీలో చేరిన నేపథ్యంలో నేతలు ఆయనతో తమకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఈ సందర్భంగా ప్రసంగాల మధ్యలో బొత్స ఒక్కసారిగా బోరున ఏడ్చారు. దీంతో సభలో భావోద్వేగ వాతావరణం నెలకొనగా.. కార్యకర్తలు కూడా కంటతడి పెట్టుకున్నారు.