AP:
వైసీపీ విస్తృతస్థాయి సమావేశంలో ఆ పార్టీ సీనియర్ నేత బొత్స సత్యనారాయణ మరోసారి భావోద్వేగానికి గురయ్యారు. శనివారం మాజీ మంత్రి గుడివాడ అమర్‌నాథ్ మాట్లాడుతుండగా మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఒక్కసారిగా బోరున ఏడ్చేశారు. తన రాజకీయ ప్రయాణంలో బొత్స అందించిన సహకారాన్ని అమర్‌నాథ్ గుర్తుచేస్తుండగా బొత్స కంటతడి పెట్టుకున్నారు.