ఏపీలో పెరుగుతున్న బీపీ, మధుమేహం కేసులు

21చూసినవారు
ఏపీలో పెరుగుతున్న బీపీ, మధుమేహం కేసులు
ఆంధ్రప్రదేశ్‌లో బీపీ, మధుమేహం కేసులు ఆందోళనకరంగా పెరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా 12.23 లక్షల మందికి బీపీ, 11.58 లక్షల మందికి మధుమేహం ఉన్నట్లు గుర్తించారు. ప్రస్తుతం రాష్ట్రంలో మొత్తం 59.63 లక్షల మంది బీపీతో, 48.95 లక్షల మంది మధుమేహంతో బాధపడుతున్నట్లు అధికారులు వెల్లడించారు. వీరిలో 34 లక్షల మందికి రెండు సమస్యలూ ఉన్నట్లు గుర్తించారు. గత 14 నెలల్లో 2.86 కోట్ల మందికి వైద్య పరీక్షలు నిర్వహించగా, 12,768 క్యాన్సర్ కేసులు కూడా వెలుగుచూశాయి. ఈ వివరాలతో కూడిన NCD 4.0 సర్వే నివేదికను అధికారులు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్‌కు అందించారు.

సంబంధిత పోస్ట్