టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ కానుక

29చూసినవారు
టీటీడీ ఉద్యోగులకు బ్రహ్మోత్సవ కానుక
AP: టీటీడీ ఉద్యోగులకు టీటీడీ ఈవో రవిచంద్ర బుధవారం తీపికబురు అందించారు. రాబోయే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఒక్కో టీటీడీ ఉద్యోగికి రూ.16,940, కాంట్రాక్ట్ ఉద్యోగులకు రూ.8,470 చొప్పున బహుమానంగా అందజేస్తున్నట్లు ప్రకటించారు. అదేవిధంగా వేదపారాయణదారులు, ప్రబంధం చేసేవారికి వేతన పెంపు, స్విమ్స్ బకాయిలకు రూ.41.2 కోట్ల గ్రాంటు, శిల్ప కళాశాల హాస్టళ్లకు రూ.23 కోట్లు, టీటీడీ ఉద్యోగుల ఇంటి స్థలాల అభివృద్ధికి రూ.230 కోట్ల నిధులను కేటాయిస్తున్నట్లు ఈవో వెల్లడించారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్