BREAKING: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం

881చూసినవారు
BREAKING: తీరాన్ని తాకిన తీవ్ర వాయుగుండం
AP: ఉత్తర బంగాళాఖాతంలో ఏర్పడిన తీవ్ర వాయుగుండం శ్రీకాకుళం జిల్లా ఉత్తర తీర ప్రాంతంలో తీరాన్ని తాకింది. ఇది పూర్తిగా తీరం దాటేందుకు మరింత సమయం పట్టనుండటంతో జిల్లా వ్యాప్తంగా ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు దంచికొడుతున్నాయి. తీరం వెంట గంటకు 50 నుండి 70 కి.మీ వేగంతో బలమైన గాలులు వీస్తున్నాయి. అధికారులు తీరప్రాంత ప్రజలను, జాలర్లను అప్రమత్తం చేశారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలిస్తూ సహాయక చర్యలు ముమ్మరం చేశారు.

సంబంధిత పోస్ట్