అర్బన్ పీఎస్ వద్ద బీటెక్ రవి నిరసన

23చూసినవారు
AP: పులివెందుల నియోజకవర్గం తొండూరు మండలం అగడూరు గ్రామంలో టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. వందలాది వైసీపీ కార్యకర్తలు కర్రలతో దాడికి పాల్పడ్డారని టీడీపీ ఇన్‌చార్జి బీటెక్ రవి ఆరోపించారు. ఈ ఘటనలో గాయపడిన వారిని పరామర్శించిన ఆయన, పోలీసులు నిందితులపై చర్యలు తీసుకోవడం లేదని ఆరోపిస్తూ అర్బన్ పోలీస్ స్టేషన్ వద్ద నిరసన చేపట్టారు. చర్యలు తీసుకోని పక్షంలో డీఎస్పీ కార్యాలయం ముందు ధర్నా చేస్తామని ఆయన అధికారులను హెచ్చరించారు.

సంబంధిత పోస్ట్