AP: విశాఖలోని సత్యం జంక్షన్ వద్ద బస్సుకు ప్రమాదం తప్పింది. విశాఖపట్నం నుంచి మద్దిలపాలెం వెళ్తుండగా సత్యం జంక్షన్ వద్ద సునీత నర్సింగ్ హోమ్ వైపు బస్సు దూసుకెళ్లింది. ప్రయాణికులు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఘటనా స్థలానికి హోంమంత్రి అనిత చేరుకుని పరిశీలించారు. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.