ఎన్నికలను పూర్తిగా రద్దు చేయండి: విజయ్ సాయి రెడ్డి

12చూసినవారు
ఎన్నికలను పూర్తిగా రద్దు చేయండి: విజయ్ సాయి రెడ్డి
ఏపీలో అర్నాబ్ తుఫాన్ బీభత్సం సృష్టిస్తున్న నేపథ్యంలో, స్థానిక సంస్థల ఎన్నికలను వాయిదా వేయాలని మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి మరియు పర్యావరణవేత్త బొలిశెట్టి సత్యనారాయణ డిమాండ్ చేశారు. శ్రీకాకుళం నుండి కృష్ణా జిల్లా వరకు తుఫాన్ ప్రభావం తీవ్రంగా ఉందని, సహాయక చర్యలు కొనసాగుతున్న తరుణంలో ఎన్నికలు నిర్వహించడం సరికాదని వారు అభిప్రాయపడ్డారు. ప్రస్తుతం ఉన్న ఎన్నికల ప్రక్రియను రద్దు చేసి, తుఫాన్ పరిస్థితులు చక్కబడిన తర్వాతే కొత్త నోటిఫికేషన్ విడుదల చేయాలని వారు రాష్ట్ర ఎన్నికల కమిషన్‌ను కోరారు.

సంబంధిత పోస్ట్